TGSRTC jobs recruitment notification 2025 – మొత్తం 3038 ఖాళీలు
హైదరాబాద్, ఈరోజు: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో (TGSRTC) మొత్తం 3038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి మరియు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనలతో ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. గతంలో SC వర్గీకరణ ప్రక్రియ నడుస్తుండటంతో నోటిఫికేషన్ ఆలస్యం కాగా, ఇప్పుడు అది పూర్తయినందున TGSRTC నియామక ప్రక్రియను ప్రారంభించింది.
TGSRTC ఖాళీల వివరణ:
-
డ్రైవర్లు – 2,000 పోస్టులు
-
శ్రామిక్‌లు – 743 పోస్టులు
-
డెప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84 పోస్టులు
-
డెప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) – 114 పోస్టులు
-
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25 పోస్టులు
-
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 23 పోస్టులు
-
అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్) – 18 పోస్టులు
-
సెక్షన్ ఆఫీసర్ – 11 పోస్టులు
-
అకౌంట్స్ ఆఫీసర్ – 6 పోస్టులు
-
మెడికల్ ఆఫీసర్ (జనరల్) – 7 పోస్టులు
-
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 7 పోస్టులు
TGSRTC రిక్రూట్మెంట్ ముఖ్యాంశాలు:
-
నోటిఫికేషన్ విడుదల తేదీ: త్వరలో
-
దరఖాస్తు విధానం: ఆన్లైన్ (TGSRTC అధికారిక వెబ్సైట్ ద్వారా)
-
అర్హత, వయసు పరిమితి, ఫీజు, ఎంపిక విధానం: అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెల్లడిస్తారు.
మంత్రివర్యుల వ్యాఖ్యలు:
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “RTCలో ఉద్యోగాల భర్తీ అనేది చాలా కాలం తర్వాత జరుగుతున్న ముఖ్యమైన దశ” అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 60,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
TGSRTC నోటిఫికేషన్ 2025కు సంబంధించిన పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియ త్వరలో విడుదల కానుంది. తదుపరి అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా సందర్శించండి.
No comments:
Post a Comment
Follow telegram for latest updates at https://t.me/govtjobonline